జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను సన్మానించిన ... నూతన జిల్లా ఉపాధ్యక్షులు గడప దేవేందర్
తూప్రాన్ ,మార్చి 22( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షులు గా గడప దేవేందర్ ను నియమించి పార్టీ బలోపేతం లక్ష్యంగా మెదక్ జిల్లా కమిటీ లో స్థానం కలిపించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పి. మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార చైర్మన్ గడప దేవేందర్ జిల్లా ఉపాధ్యక్షుడు గా నియమించడం తో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ను ఘనంగా సన్మానించారు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రేమే నా బలం – మీతో ఈ బంధమే నా ఊపిరి. మీ అందరి ఆశీస్సులతో మరింత బాధ్యతగా, శక్తివంతంగా పనిచేస్తానాని . జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను” అని గడప దేవేందర్ స్పష్టం చేశారు.


