కరెంటు కష్టాలు మొదలయ్యాయి.... రైతులు కోసం ధర్నా చేస్తా....
మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ...
చిన్నశంకరంపేట, మార్చి 16( ప్రజాస్వరం ) :
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన విధంగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. సోమవారం ఆమె చిన్న శంకరం పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పరిపాలనలో మాటలేమో కోటాలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదని, కరెంటు సరిగా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు పడిరాని పాట్లు పడుతున్నారని, విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు కరెంట్ విషయంలో ప్రభుత్వాన్ని కరెంట్ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీలో మాట్లాడుతారని తెలిపారు. లేనిపక్షంలో తమ పార్టీ రైతులతో పంటలు పరిశీలించి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, మాజీ జెడ్పిటిసి మాధవి, లక్ష్మారెడ్డి, పూలపల్లి యాదగిరి యాదవ్, సూల సావిత్రి పోచయ్య, దయానంద్ యాదవ్, ప్రభాకర్, గొండ స్వామి యాదవ్, ఏమ చంద్రం, మహిపాల్ రెడ్డి, పాండు, తదితరులు పాల్గొన్నారు


