రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన రాఘవేందర్ గౌడ్*

రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన రాఘవేందర్ గౌడ్*

 

మేడ్చల్,(ప్రజాస్వరం):

:రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగ రాను ఉండడంతో ముస్లిం పేద కుటుంబాలకు తోఫా పంపిణీ చేయడం ఎంత సంతృప్తిగా ఉందని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాలలో ఉన్నటువంటి పేద ముస్లిం కుటుంబాలకు సుమారు 250 రంజాన్ తోఫా కిట్లను స్థానిక నాయకులుతో కలిసి రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆదివారం పంపిణీ చేశారు. ముస్లింలు రంజాన్ ఉపవాసాలను అనుసరిస్తూ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. తన వంతు సహాయంగా ప్రతి ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉద్దేశంతో తోఫా కిట్లను అందజేస్తున్నట్లు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లయక్ అలీ, పాషా, ఇజాక్, సాబీర్, జావేద్, రఫిక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....