ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.....
జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూప.....
By Prajaswaram
On
గ్రామాల్లో వికలాంగుల హక్కుల కమిటీల ఏర్పాటు.......
ప్రజాస్వరం : మెదక్, జూన్ 20 :
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి, వాడి గ్రామాల్లో శనివారం వికలాంగుల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూప తెలిపారు. ఎంపీడీఓ ఆదేశాల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వికలాంగుల హక్కుల గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఘాజిరెడ్డిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కాయితి పోచయ్య, ఉపాధ్యక్షుడిగా కల్వకుంట్ల వెంకయ్య, కార్యదర్శిగా ఉప్పల పోచయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా మహేష్, అరవింద్, యాదగిరి, యాదయ్యలను నియమించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వాడి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా బీరయ్యను ఎన్నుకోగా, కళావతి, భిక్షపతి, రెడ్డి ఎల్లయ్యలను కమిటీ సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.4,000 నుంచి రూ.6,000కు పెంచాలని, అలాగే ఇందిరమ్మ గృహ పథకంలో వికలాంగులకు 5 శాతం ఇళ్లను ప్రత్యేకంగా కేటాయించి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు, వికలాంగుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Latest News
21 Jun 2026 11:46:28
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం.... పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల. ఆంజనేయులు... ప్రజాస్వరం : మెదక్ : జూన్ 21 : తెలంగాణ ఉద్యమానికి


