యువత సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం...
సతీష్ పటేల్.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మెదక్, జూన్ 20 :
మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ అధ్యక్షతన శనివారం యువ సమ్మేళనం నిర్వహించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వళ్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అరవింద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పిస్తోందన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా మిషన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, మై భారత్, పీఎం ఇంటర్న్‌షిప్ పథకం, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్, పీఎం-సేతు, పీఎం-దక్ష్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి పథకాల ద్వారా యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో ఆవిష్కరణలకు, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి విశేష ప్రోత్సాహం అందుతోందని తెలిపారు. దేశ భవిష్యత్తుకు యువతే వెన్నెముక అని, వారి శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించుకోవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, కో-కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ యువమోర్చా నాయకులు అరవింద్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్లు కంచం సాయి, పోతారాజు అనిల్, జిల్లా యువమోర్చా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జీలు, యువ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Latest News
21 Jun 2026 11:46:28
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయం.... పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల. ఆంజనేయులు... ప్రజాస్వరం : మెదక్ : జూన్ 21 : తెలంగాణ ఉద్యమానికి


