మల్కాపూర్ లోని హమ్నపూర్ తాండ లో స్వచ్ఛ భారత్.. ..
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 7 :
పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 404 వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం ఎనిమిదో వార్డులోని న్యూ హమ్నాపూర్ తండాలో చేపట్టారు. ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తండావాసులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు.గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం, మెకిన్ యువత పనిచేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పిఎసిఎస్ డైరెక్టర్ గోపి, వార్డు సభ్యులు, కృష్ణ, వేణు,తిరుపతి, మాజీ వార్డ్ సభ్యులు శ్రీను, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
07 Jun 2026 17:16:28
ప్రజాస్వరం : మేడ్చల్: జూన్ 07 : పవిత్ర మైన మృగశిరను పురస్కరించు కొని మేడ్చల్ జిల్లా కండ్లకోయ లోని సాయిగీత ఆశ్రమంలో ఉచిత ఆస్థమా వైద్య...


