10 వేల రైతుల అకౌంట్ల లో 100 కోట్ల వడ్ల పైసలు పడ్డాయి... 

అర్డీఓ జయ చంద్ర రెడ్డి .....

10 వేల రైతుల అకౌంట్ల లో 100 కోట్ల వడ్ల పైసలు పడ్డాయి... 

తూప్రాన్ డివిజన్ లో 6లక్షల 72 వేల క్వింటాల్ కొనుగోలు....

పోయిన ఏడాది కంటే ఇప్పటికే లక్ష క్వింటాలు అధికంగా కొనుగోలు.. 

 

ప్రజాస్వరం : తూప్రాన్ : జూన్ 6  : 

 

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ లోని ఆరు మండల పరిధి లోని 87 వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 6 లక్షల 72 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలియ జేశారు. మే 6 నాడు వడ్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, నేటికి నెల రోజులు అయిందని, ఇప్పటికే 6 లక్షల 72 వేల క్వింటాలు వడ్ల కొనుగోలు నెల లోపు చేయటం ఒక రకంగా రికార్డు అని ఆయన అన్నారు. గత సంవత్సరం నెలన్నర కాలం లో జూన్ 15 వరకు మొత్తం కొన్న వడ్ల కేవలం 5 లక్షల వేల 70 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమేనని, గత ఏడాది కంటే ఇప్పటికే లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించటం జరిగిందని అర్డీఓ చెప్పారు. ఇప్పటికే 10 వేల 92 మంది రైతుల అకౌంట్లలో ప్రభుత్వం 100 కోట్లు జమ చేసిందని అన్నారు. ఇంకా ఇంకా 4 వేల రైతులకు ఈ వారం లో జమ అయితాయి అని జయ చంద్ర రెడ్డి తెలిపారు.