ఘనంగా సంగీత మహోత్సవం.....
దినకర్ పాల్ కు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్వర్ణ పతకం...
ప్రజాస్వరం : మెదక్ ,జూన్ 01 :
సంగీత దర్శకుడు, గీత రచయిత, ఉత్తమ స్వరకర్త, ప్రఖ్యాత సంగీత గురువు, దినకర్ పాల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకులు జి. దినకర్ పాల్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 2026 మే 30 న విశిష్టమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు 5,000 మందికి పైగా విద్యార్థులకు సంగీత శిక్షణ అందించిన దినకర్ పాల్, లండన్‌లోని ట్రినిటీ యూనివర్సిటీ గుర్తింపు పొందడంతో పాటు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పాఠశాలలో సేవలందిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమంలో 111 మంది వాద్యకారులు కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, తబలా వంటి వాద్యాలను 60 నిమిషాల పాటు నిరంతరాయంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాస్టర్ జి. యోబు ఆధ్వర్యంలో జరిగిన ఈ అద్భుత కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జి. దినకర్ పాల్ విశిష్ట కృషిని గుర్తిస్తూ “తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్” స్వర్ణ పతకం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దినకర్ పాల్ యువతకు, సంగీతాభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


