నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...

నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...

ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :

 

పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్ ప్రయత్నించాడన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాయిద్ ఖాన్ మేడ్చల్ లో స్థానికంగా ఉన్న హోటల్‌ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉన్నాడని, పాకిస్తాన్ ISI మద్దతు కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు సహాయం చేయడం దేశానికి ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడం జరిగిందని అన్నారు. జాయిద్ ఖాన్ నుండి మొబైల్ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నారు.రెండు నకిలీ పిస్టల్స్ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Latest News

నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్... నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :   పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...
వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..
వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....
అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..
తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....
బేటి బచావో- బేటి పడవో నినాదంతో యువకుడి బైక్ యాత్ర...
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....