రన్ ఫర్ డ్రీమ్స్ మెదక్ జిల్లా కాళ్లకల్ స్వాగతం....

రన్ ఫర్ డ్రీమ్స్ మెదక్ జిల్లా కాళ్లకల్ స్వాగతం....

ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 6  : 

 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో శనివారం ఉదయం రన్ ఫర్ డ్రీమ్స్ సూపి సోపియా కు ఘన స్వాగతం పలికారు.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూఫీ సోఫియా కన్యాకుమారి నుంచి కరంకోరం వరకు చేపట్టిన 5000 కిలోమీటర్ల ‘రన్ ఫర్ డ్రీమ్స్’ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు శనివారం చేరుకుంది. గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రన్ ఫర్ డ్రీమ్స్ కార్యక్రమం రెండు రోజుల పాటు మెదక్ జిల్లాలో కొనసాగనుందని గజ్వేల్ రన్నర్స్ రమేష్ గౌడ్, మధుసూదన్, నరేష్, కిరణ్ తెలిపారు.