ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ .....

రంగి కృష్ణ  .....

ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ .....

మనెవారి జలాల్‌పూర్‌లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు... 

99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ నెల 10 వరకు కార్యక్రమం..

 

ప్రజాస్వరం : వెల్దుర్తి : జూన్ 05 :

 

 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మనెవారి జలాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 99 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగి కృష్ణ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు గ్రామంలోని ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పచ్చదనం పెంపొందితేనే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందుతుందని అన్నారు. 99 రోజుల ప్రణాళిక ద్వారా మండలంలోని అన్ని గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.