మిర్యాలగూడలో ఘోర ప్రమాదం....

మిర్యాలగూడలో ఘోర ప్రమాదం....

షార్ట్ సర్క్యూట్ తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి....

ప్రజాస్వరం :  మిర్యాలగూడ ,జూన్ 05 :

మిర్యాలగూడలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. కలాల్వాడలో ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. మృతులు అమ్మమ్మ చంద్రమ్మ(50), మనవడు లక్ష్మణ్(17),మనవరాలు ప్రణతి(14). ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారుఉ. మూడు మృతదేహాలు గుర్తించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.