తూప్రాన్ లో మొక్కలు నాటిన జిల్లా న్యాయమూర్తి నీలిమ .....

తూప్రాన్ లో మొక్కలు నాటిన జిల్లా న్యాయమూర్తి నీలిమ .....

ప్రజాస్వరం  : తూప్రాన్ ,జూన్ 5  : 

 

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నూతన కోర్టు భవనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పట్టణానికి మంజూరైనా కోర్టు పాత ఎంపీడీఓ భవనం లో ఏర్పాటు కావడం తో భవనని రిపేర్ చేస్తున్న దాని పరిశీలించి భవన పత్రాలను జిల్లా కోర్టు న్యాయమూర్తి కి అప్పగించారు తూప్రాన్ లో కోర్టు మంజూరు తో ఎక్కడి చుట్టూ ప్రక్కల వారికి మెదక్ వెళ్లే అవసరం లేకుండా తూప్రాన్ లో అందుబాటులో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్, ఆర్డివో జయ చంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ వేణు, సీఐ వెంకట్ రాజా గౌడ్, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, ఎస్సై గంగరాజు, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.