పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత......

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత......

ప్రజాస్వరం : మెదక్ ,జూన్ 05  :

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమం శుక్రవారం మెదక్ పట్టణంలోని మల్లం చెరువు కట్ట పైన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి మొక్క లను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించే విధంగా కృషి చేయాలన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ తో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్స్ గౌస్ కురిషి, శాంసున్నిస బేగం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.