ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు......

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు......

ప్రజాస్వరం : మెదక్, జూన్ 02  : 

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ కోసం మరో ఉద్యమం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, కౌన్సిలర్ గంగమణి, నాయకులు సుప్రభాత రావు, అకిరెడ్డి కృష్ణా రెడ్డి, డాకూరి రాధ, అంకం చంద్రకళ, ఆంజనేయులు గౌడ్, జీవన్ రావు, మాజీ సర్పంచ్లు, మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.