మెల్లూరు కార్యదర్శిగా నవీన్ రెడ్డి .....

మెల్లూరు కార్యదర్శిగా నవీన్ రెడ్డి .....

ప్రజాస్వరం : వెల్దుర్తి : జూన్ 02 :

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా నవీన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన చార్జి తీసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి నూతన కార్యదర్శిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకుపారదర్శకమైన సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.