మండల వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....

మండల వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....

ప్రజాస్వరం : నార్సింగి ,జూన్ 02 :

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల వ్యాప్తంగా త్రివర్ణ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గ్రేస్ బాయి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ బీమరి సృజన, ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిండెంట్ రాజేశ్వర్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. రవి కుమార్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, మేజర్ గ్రామ పంచాయతీ నార్సింగిలో సర్పంచ్ ఆకుల మల్లేశ్ గౌడ్, శేరిపల్లి లో సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్, ఐకేపీ భవనంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నవనీత, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.