చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు....

చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

ప్రజాస్వరం : నార్సింగి ,జూన్ 02 :

 

ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు స్పష్టం చేశారు. మండల పరిధి గ్రామమైన నర్సంపల్లి లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్, డైరెక్టర్ ఎం.ఏ రఫీక్, కాంగ్రెస్ నాయకులతో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఏమైనా సమస్యలు ఉంటే పరిశరించే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, రైతులు అధైర్య పడవద్దని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న లారీల, హమాలీల సమస్య ను లారీ ఓనర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామని అన్నారు. మండలంలో మొత్తం 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేస్తున్నామని, అందులో 4 కేంద్రాలలో కొనుగోలు, తరలింపు ప్రక్రియ పూర్తి చేసుకున్నాయని తెలిపారు. మిగతా కేంద్రాలలో దాదాపు కొనుగోలు పూర్తి అయ్యాయని ఒక్కో కేంద్రంలో 3 నుంచి 4 లారీల వడ్ల వరకు మిగిలాయి అని, వాటి కొనుగోలు మరో మూడు నాలుగు రోజులలో పూర్తి చేసి మిల్లులకు ధాన్యం తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు ఖలీల్, సంతోష్, సందీప్ పార్టీ జిల్లా నాయకుడు బాలరాజు గౌడ్, రాజేశ్వర్ గౌడ్, ఐకేపీ ఏపీఎం సృజన కుమార్ రెడ్డి, సీసీ శ్రీనివాస్ గౌడ్, జీ.పీ.ఓ నాగరాజు, నాయకులు ఎల్లం, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.