ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు....

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు....

ప్రజాస్వరం : మెదక్ ,జూన్ 02  :

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ పతాకన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు చిన్న శంకరంపేట అమరవీరుల స్తూపం, మెదక్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి..కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ డి వి శ్రీనివాస్ నివాళులు అర్పించి పోలీసుల నుండి మంత్రి వివేక్ వెంకట స్వామి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని సామూహికంగా అలాపింంచారు. 12 వ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమరుల ఆశయాలను ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమై ముందుకు పోతుందన్నారు.అనంతరం జిల్లాలో అమలు చేస్తున్నా వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను మంత్రి చదివి వినిపించారు. వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలను మంత్రి కలెక్టర్ ఎస్పీ ఆసక్తిగా తిలకించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ను మంత్రి పరిశీలించారు.