వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....
కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 :
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి,రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణ గౌడ్, ఉపసర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకుడు నల్లచెరువు శేఖర్ గౌడ్, శెట్టిపల్లి వెంకట్ రెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికెల సత్యనారాయణ, దుర్గా గౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్త బాయి, పాండు, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు.


