ఆదర్శ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్.....
20 వేలు మొబైల్ స్వాధీనం.....
ప్రజాస్వరం : మెదక్ ,మే 14 :
బెట్టింగ్ లకు అలవాటు పడి భారీ కుంభకోణానికి పాల్పడిన మెదక్ ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ యాదం అనిల్ ను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో మేనేజర్ యాదం అనిల్ 1.79 కోట్లు నకిలీ బంగారం పెట్టీ రుణం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బుధవారం అనిల్ భార్య, గోల్డ్ అప్రెసర్ శ్రీనివాస్ చారి, సుబ్రమణ్యం ను అరెస్టు చేసిన పోలీస్ లు రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు యాదం అనిల్ పరారీలో ఉండగా గురువారం మెదక్ పట్టణ పోలీసులు బ్యాంక్ మేనేజర్ అనిల్ ను కామారెడ్డి పట్టణంలోని శైలాని బాబా కాలనీలో పట్టుపడడం జరిగిందని అన్నారు. అతని వద్ద 20 వేల నగదు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


