మేడ్చల్ పట్టణం లోని ప్రజల సమస్యలను పరిష్కరించాలి...

మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్....

మేడ్చల్ పట్టణం లోని ప్రజల సమస్యలను పరిష్కరించాలి...

ప్రజాస్వరం : మేడ్చల్ : మే 14 : 

 

మేడ్చల్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్న మాజీ మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శ్రీ చీర్ల రమేష్ సి.ఎం.సి కమిషనర్ డాక్టర్ జి. సృజన ని కలిసి మేడ్చల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపై వినతి పత్రం సమర్పించి చర్చించారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్  హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి లైబ్రరీ రోడ్ వరకు ఉన్న సుమారు 300 మీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ రహదారిపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ రోడ్డును శుభ్రపరచి నూతన సీసీ రోడ్డును నిర్మించాలని కోరారు.అలాగే మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఇంటి నుండి ముదిరాజ్ సంఘం వరకు ఉన్న సుమారు 250 మీటర్ల రోడ్డును అభివృద్ధి చేసి సీసీ రోడ్ వేయాలని విజ్ఞప్తి చేశారు.మేడ్చల్ పట్టణంలోని అన్ని కాలనీలలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కాలనీలో సరైన శానిటేషన్ నిర్వహణ ఉండేలా చూడాలని, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు రాత్రి వేళల్లో భద్రత కల్పించాలని, రోడ్లలో ఉన్న గుంతలను సీసీ ప్యాచ్ వర్క్ ద్వారా త్వరితగతిన పూర్తి చేసి ప్రజ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు.ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన సి.ఎం.సి కమిషనర్ డాక్టర్ జి. సృజన సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అభినందనీయమని చీర్ల రమేష్ గారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పాలన వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.