మెదక్ జిల్లా పోలీస్ స్టేషన్లలో CC కెమెరాలు .....
డి వి శ్రీనివాస్ రావు ...
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 13 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఎస్పీ మీడియా తో మాట్లాడుతు.. జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయిని ఆయన అన్నారు.పారదర్శకత జవాబుదారీతనం అన్ని పోలీస్ స్టేషన్లలో,సీసీ లాకప్‌లు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద తప్పనిసరిగా CC కెమెరాలు బిగించాలని ఎస్పీ ఆదేశించారు పోలీసుల ప్రవర్తన రికార్డ్ అవుతుంది. కస్టోడియల్ హింస, లాకప్ డెత్స్ లాంటి ఘటనలను అరికట్టవచ్చు.ఫిర్యాదుదారులతో, నిందితులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అని ఆయన పేర్కొన్నారు. నేర నిరోధం & భద్రత నేరస్థుల్లో భయం కెమెరాలు ఉన్నాయనే భావనతో స్టేషన్ లోపల, బయట నేరాలు తగ్గుతాయి.సాక్ష్యం దొంగతనం, దాడులు, విధ్వంసం జరిగితే వీడియో ఫుటేజ్ స్టేషన్ భద్రత రాత్రిపూట స్టేషన్‌పై దాడులు, రికార్డుల తారుమారును అడ్డుకోవచ్చుఅని ఆయన అన్నారు స్టేషన్ లో ఫిర్యాదుదారులకు మేలు రుజువు "పోలీసులు పిర్యాదు తీసుకోలేదు", "దురుసుగా ప్రవర్తించారు" అనే ఆరోపణలు వస్తే ఫుటేజ్ చూసి నిజం తేల్చవచ్చు.నమ్మకం ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. సామాన్యుడు భయం లేకుండా స్టేషన్‌కు వెళ్లగలుగుతాడు.విధి నిర్వహణ డ్యూటీలో ఉన్న సిబ్బంది పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించవచ్చుఅని మహిళా ఫిర్యాదుదారుల భద్రత మహిళా హెల్ప్ డెస్క్ వద్ద కెమెరాలు ఉంటే మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయగలరు. ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. ఈ కార్యక్రమం లో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ సిఐ వెంకట రాజా గౌడ్ ఎసై గంగరాజు లు ఉన్నారు.


