తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కీర్తన విఠల్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ...
ప్రజాస్వరం: తూప్రాన్ ,మే 2 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ నూతన మార్కెట్ కమిటీ కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం రోజు చైర్ పర్సన్ గా పంజాల కీర్తన విఠల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు వైస్ చైర్మన్ గా మామిండ్ల కృష్ణ ముదిరాజ్ డైరక్టర్ లు గా సింగి మైపాల్ రెడ్డి ,జక్కిడి ప్రభాకర్ రెడ్డి, నావబోత్ శ్రీనివాస్ , మాదం శెట్టి వెంకటేష్ గుప్తా. సంద వెంకటేష్ యాదవ్ ,గొల్లపల్లి సురేందర్ రెడ్డి, మహ్మద్ హమీద్, ఊట్ల సత్యనారాయణ ముదిరాజ్, దొడ్ల వెంకటేష్ , దాసరి నాగరాణి లక్ష్మణ్ లు కార్యాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు రైతు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసి 9 ఏళ్లకు నూతన పాలక వర్గం ఏర్పాటు కావడం రైతులు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు నిర్మాణం. ఉమ్మడి తూప్రాన్ మండలానికి కొత్త మార్కెట్ కమిటీ ఏర్పాటుతో రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో మరింత సౌలభ్యం కలుగుతుంది. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లను నియమించారు. త్వరలో నే మంత్రి పార్టీ ఇంచార్జ్ లతో భారీ గా రైతుల తో సభ ఏర్పాట్లు చేస్తాం అని పాలక వర్గం తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమల ఎలక్షన్ రెడ్డి, మాజీ ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ ,మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పంజాల సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లు కాంగ్రెస్ నాయకులు హాజరై చైర్మన్ పాలక వర్గాని సన్మానించారు.


