అప్పులబాధతో వ్యక్తి .....

ఎసై సృజన 

అప్పులబాధతో వ్యక్తి .....

ప్రజాస్వరం : నార్సింగి ,మే 01 :

 

అప్పుల బాధతో గత సంవత్సరం నుండి ఇంటి నుండి వెళ్లిపోయి కనిపించకుండా పోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధి జాతీయ రహదారి 44 వల్లూరు వద్ద చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ బీమరి సృజన తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణానికి చెందిన బోడ చంద్రశేఖర్ 45సం తండ్రి నర్సయ్య కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ లెక్చరర్ గా పని చేసేవాడని చంద్రశేఖర్ కు గతంలో రెండు సార్లు పెళ్ళి కాగా అతనికి ఇద్దరు భార్యలు వదిలి వెళ్లిపోయారు. వారికి భరణంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇల్లు అమ్మి చెల్లించాడని అలాగే తన అవసరాల నిమిత్తం క్రెడిట్ కార్డులపై కూడా అప్పులు తీసుకున్నాడని, ఇల్లు అమ్మవలసి రావడంతో పాటు అయిన అప్పులతో మనస్తాపం చెంది గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఉద్యోగం మానేసిన చంద్రశేఖర్ గత ఏడాది అక్టోబర్ లో అప్పుల బాధతో ఇల్లు విడిచి పోతున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆచూకీ లభించని చంద్రశేఖర్ మే 1న శుక్రవారం ఉ 8గం ప్రాంతంలో వల్లూరు సమీపంలో జాతీయ రహదారి 44 పక్కగా ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని శవంగా లభించాడు. శవం లభ్యమైన పరిస్థితిని బట్టి చూస్తే గురువారం 30 ఏప్రిల్ రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చామని అన్నారు. మృతదేహం వద్ద లభ్యమైన ఆధార్ కార్డుతో చంద్రశేఖర్ గా గుర్తించి సంబంధీకులకు విషయాన్ని తెలియజేశామని చెప్పారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బీమరి సృజన తెలిపారు.

Latest News

తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కీర్తన విఠల్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ... తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కీర్తన విఠల్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ...
ప్రజాస్వరం: తూప్రాన్ ,మే 2 :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    మెదక్ జిల్లా తూప్రాన్ నూతన మార్కెట్ కమిటీ కి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో...
కార్మికుల హక్కుల కోసమే మేడే దినోత్సవం...
అప్పులబాధతో వ్యక్తి .....
టీపీసీ ‘ప్రో ఎక్స్’ అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్‌ప్రెస్ సేవ ప్రారంభం....
దళిత రత్న అవార్డు పొందిన నల్ల నరేందర్, నల్ల శ్రీను .....
కన్నుల పండుగ కూర్మా నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ....
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు....