ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి 55వ పుట్టినరోజు వేడుకలు....

ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి 55వ పుట్టినరోజు వేడుకలు....

ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 19

 

కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 55 వ జన్మదిన వేడుకలు నార్సింగి మండల కేంద్రం లోని ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తా వద్ద నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేకు కోసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అలనాటి మేటి నాయకుడు స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అసలైన రాజకీయ వారసుడని అన్నారు. ముత్యం రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ పేద, బడుగు వర్గాలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరేన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో విరాజిల్లుతూ రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రి లోని రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, రఫీక్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రాజేష్, మాజీ ఉపసర్పంచ్ రుక్ముద్దీన్, పార్టీ జిల్లా నాయకుడు బాలరాజు గౌడ్, నాయకులు శంకర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, జహీర్, ఎం కె రాజు, చందు యాదవ్, మోతి లాల్, బాబా గౌడ్, రాజేశ్వర్ గౌడ్, దొంతి స్వామి, మైలారం మహేష్ తదితరులు పాల్గొన్నారు.