మాందాపూర్ అంగన్‌వాడీలో పోషణ్ పక్వాడ్..
ప్రజాస్వరం : జగదేవ్ పూర్ ,ఏప్రిల్ 19,
జగదేవ్ పూర్ మండల పరిధిలోని మాందాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ్ పక్వాడ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లలకు అందించాల్సిన పోషకాహార ప్రాముఖ్యతపై తల్లులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ఐసీడీఎస్ సీడీపీఓ సరిత , సూపర్వైజర్ సంతోష ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. అంగన్‌వాడీ సేవల డిజిటలైజేషన్‌లో భాగంగా ఇదే వేదికపై టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాందాపూర్ సర్పంచ్ లింగాల మౌనిక ముత్యం, పలుకుగడ్డ సర్పంచ్ నర్రా కనకయ్య, ఉప సర్పంచులు నర్రా రాములు, నర్రా కళ్యాణి, వార్డు సభ్యులు నర్రా నవీన్, నర్రా సురేష్, ఎం. హేమలత పాల్గొన్నారు. అలాగే తీగుల్ పీహెచ్‌సీ డాక్టర్, గ్రామ ఆశా వర్కర్ స్వప్న మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొని ఆరోగ్య సూత్రాలను వివరించారు.


