బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  ....

పటాన్ చెరు లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు....
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...

పటాన్ చెరు, ఏప్రిల్ 14(ప్రజాస్వరం):

 

దేశం లోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువ లేనిదని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించు కొని మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి, బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు. నేటి తరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, రుద్రారం శంకర్, వెంకటేష్, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, అశోక్, అఫ్జల్, రాములు, మాదిరి పృథ్వీరాజ్, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.