ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ....

ఆర్యవైశ్య యువజన సంఘం  ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ....

 

 

ప్రజాస్వరం : మేడ్చల్ : ఏప్రిల్ 19

అక్షయ తృతీయను పురస్కరించుకొని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎల్ఐసి ఏజెంట్ తాళ్లపల్లి నాగేష్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో మజ్జిగ పంపిణీ ప్రజలకు ఎంతో ఉపయోగపడతుందని ,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య యువజన సంఘ నేతలను అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ పంపిణీ ని ప్రతి శని, ఆది వారాలలో ప్రజలు వినియోగించుకోవాలని ఎల్ఐసి ఏజెంట్ తాళ్లపల్లి నాగేష్ కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు వెంకట్,ప్రధాన కార్యదర్శి నాగేష్, కోశాధికారి అవినాష్, ఉపాధ్యక్షుడు అఖిల్, సంపత్,శ్రావణ్, అరుణ్,సంతోష్,సద్గున్, చంద్ర శేఖర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.