బీజేపీకి మహిళా రిజర్వేషన్ బిల్లు పై చిత్తశుద్ధి లేదు..

అంచనూరి రాజేష్ ....

బీజేపీకి మహిళా రిజర్వేషన్ బిల్లు పై చిత్తశుద్ధి లేదు..

ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 19

 

బీజేపీ మహిళా బిల్లు పై ప్రతిపక్షాల పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టెలికాం బోర్డు మాజీ సభ్యుడు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఇండియా కూటమి పై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు వాస్తవ దూరమని అన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది మహిళా బిల్లు చాటున మోసపూరితంగా తెచ్చిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసే డెలిమిటేషన్ బిల్లేనని, బీజేపీ మోసాన్ని పసిగట్టిన ఇండియా కూటమి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి బిల్లును అడ్డుకోవడం హర్షణీయం అని అన్నారు. ఎన్డీఏ కు మహిళా రిజర్వేషన్ల పై చిత్త శుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం దుబ్బాక లో జరిగిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా చెరుకు సమక్షంలో నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కుమ్మరి మహేష్ కాంగ్రెస్ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. మండలం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, సుధాకర్, రుక్ముద్దీన్, బాచి స్వామి, మోతీలాల్, ప్రభాకర్, కటికే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.