ఆలయ నిర్మాణానికి 51 వేలను విరాళంగా ఇచ్చిన రామన్న గారి రాఘవేందర్ గౌడ్...
ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 19
జిహెచ్ఎంసి పరిధిలోని పూడూర్ కిష్టాపూర్ డివిజన్ కిష్టాపూర్ గ్రామంలోని అర్చన కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆదివారం 51 వేల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రాఘవేందర్ గౌడ్ ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు. రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహాయం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను సొంత నిధులతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చన కాలనీ సేవా సమితి అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు బుచ్చి రాములు, కాలనీవాసులు హనుమంత్ రెడ్డి, మల్లారెడ్డి, మెట్టు రాజు, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


