రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి...

మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్...

రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి...

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు...

 

మెదక్ ,ఏప్రిల్ 05 (ప్రజాస్వరం):

 

మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటల లోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని ఆదివారం ఒక ప్రకటనలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Latest News

జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం..... జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం.....
జగదేవ్ పూర్, ఏప్రిల్ 05, (ప్రజాస్వరం ):   జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక...
రేపు మెదక్ బంద్ కు పిలుపు....
రాత్రి 11 లోపు దుకాణాలు మూసివేయాలి...
29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..
యేసుక్రీస్తు మరణం పై విజయం రోజే ఈస్టర్ పండగ.... 
సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....
పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....