రేణుక ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు....

రేణుక ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు....

మాసాయిపేట, మార్చి 31 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం వార్షికోత్సవ వేడుకలను చేపట్టారు. వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశపూజ అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. గౌడ సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.