లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ....
జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ....
రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు
ఒకే నెలలో మూడు కేసులలో తీర్పు చెప్పిన జడ్జ్ సుభావలి
తూప్రాన్ , మార్చి 30 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తుప్రాన్ పోలీస్ స్టేషన్‌లో. 2023 లో నమోదైన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు వెల్లడించారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన లైంగిక డాడీ కేసులు రెండు 20 ఏళ్ళ జైలు లక్ష జరిమానా అసభ్య ప్రవర్తన లో ఒక్క కేసు లో3 ఏళ్ళు జైలు శిక్ష లక్ష జరిమానా లకేసులలో ఒకే నెలలో మూడు తీర్పులు వెల్లడించిన మెదక్ జడ్జ్ సుభావళి
తుప్రాన్ పట్టణంలో ని ఓ ప్రయివేట్ పాఠశాల లో కోమల్ అలంకర్( 28)అనే గణిత ఊపాద్యాయుడు ఓ చిన్నారి పై లైంగిక దాడి కి పలుపడినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి దర్యాప్తు అధికారి సమగ్రంగా విచారణ జరిపి సాక్ష్యాధారాలను సేకరించి, పక్క ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు,జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించిదని తెలిపారు.
కేసు విజయవంతంగా నడిపించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య, భారోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కే. స్వేత కీలక పాత్ర పోషించారు. తూప్రాన్ ఎసై , జిల్లా లైజనింగ్ ఆఫీసర్ పీసీలు జి. , సీడిఓ లు తదితరులు సమన్వయం చేశారు.ఇలాంటి కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు


