ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ...

ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....

 

గజ్వెల్ ,మార్చి 29 (ప్రజాస్వరం):-

 

సిద్దిపేట జిల్లా గౌరారం శివారులోని కావేరి యూనివర్సిటీ ఉత్తమ విశ్వవిద్యాలయo అవార్డు దక్కించుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ హర్ష పోల్సాని అవార్డు అందుకున్నారు. చక్కటి సాంకేతిక నైపుణ్యం, నూతన ఆవిష్కరణలు సత్ఫలితాలిస్తుండగా, విద్యార్థుల పట్ల సంస్థ అంకితభావం, నిబద్ధత, అందుతున్న పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకొని కావేరి విశ్వవిద్యాలయానికి ఉత్తమ యూనివర్సిటీ అవార్డు దక్కినట్లు కావేరి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు. 

వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పరిష్కారాల్లో నూతన పరిశోధన, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులు, స్థిరమైన అభివృద్ధి, ఉన్నత విద్యకు కావేరి యూనివర్సిటీ అందిస్తున్న గొప్ప గుర్తింపుకు ఈ అవార్డు ప్రామాణికంగా నిలిచిందని వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. హైదరాబాదులో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన వారు తెలిపారు.

Latest News

ఘనంగా మట్టల ఊరేగింపు.... ఘనంగా మట్టల ఊరేగింపు....
మెదక్ ,మార్చి 29 (ప్రజాస్వరం):   మట్టల ఆదివారం సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో భక్తులు ఖర్జూర...
వృదురాలి ని కాపాడిన తూప్రాన్ పోలీసులు,...
ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....
ఘనంగా సీతారాముల రథోత్సవం.....
ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....
ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....