శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....

శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....

 

 

 

నార్సింగి, మార్చి 28 ( ప్రజాస్వరం ):

 

 

నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరో వార్డులో మట్టి రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో అవసరమైన విధుల్లో సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ నిర్మిస్తామని, మండలంలో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, మల్లేశం గజవెల్లి నవీన్, కందరి శ్రీనివాస్, జంగర్ల మురళి, మానస కుమార్, మానస నవీన్, లక్ష్మి వెంకటేశం, శివ్వొల లక్ష్మి, కార్యదర్శి నాగరాజు, గ్రామస్థులు మల్లేశం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఘనంగా సీతారాముల రథోత్సవం..... ఘనంగా సీతారాముల రథోత్సవం.....
మెదక్, మార్చి 28 (ప్రజాస్వరం):   మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో...
ఘనంగా శివపార్వతుల కళ్యాణం...
శేరిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం....
ప్రభుత్వ పాఠశాల టీచర్ బెస్ట్ టీచింగ్ ” అవార్డు ప్రధానం ....
స్వయంభూ సోమేశ్వరాలయ అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగి విరాళం...
తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల” అవార్డు...  
48 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు....