స్వయంభూ సోమేశ్వరాలయ అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగి విరాళం...
జగదేవ్ పూర్, మార్చి28, (ప్రజాస్వరం):
జగదేవ్ పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలోని చారిత్రక నేపథ్యం ఉన్న స్వయంభూసోమేశ్వరాలయ అభివృద్ధి పనుల కోసం భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా, బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన అర్థం సత్యనారాయణ తన వంతు సహాయంగా ₹10,116 రూపాయలను ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకులు నిర్మించిన పురాతన ఆలయాలను కాపాడుకోవడం మరియు వాటిని అభివృద్ధి చేయడం మనందరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. తన వంతుగా ఈ చిన్న సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఆయన దాతృత్వానికి గుర్తింపుగా గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ పునర్నిర్మాణం మరియు ఇతర సౌకర్యాల కల్పన కోసం మరిన్ని విరాళాలు సేకరించాలని, భక్తులందరూ ఈ కార్యంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.


