తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల” అవార్డు...
ది జైన్ ఇంటర్నేషనల్ పాఠశాలకు
తూప్రాన్ , మార్చి 28 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి హన్స్
ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026లో రెసిడెన్షియల్ విద్యలో శ్రేష్ఠత్వాన్ని మరియు సమగ్ర విద్యార్థి అభివృద్ధిని గుర్తిస్తూ, ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ప్రతిష్టాత్మకమైన “తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ క్యాంపస్” అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ అవార్డును పాఠశాల తరపున అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, శ్రీ దక్షిణా మూర్తి గారు మరియు ప్రిన్సిపాల్, శ్రీమతి శ్రీలక్ష్మి గారు అందుకున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి లో ఉన్న RTC కళాభవన్ లో జరిగింది.
విద్యాసంస్థ సమగ్ర విద్యా వాతావరణాన్ని ,అందించడంలో అకడమిక్ శ్రేష్ఠత మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విలువ-ఆధారిత విద్య మరియు సమగ్ర విద్యార్థి అభివృద్ధిని సమీకృతం చేయడంలో పాఠశాల యొక్క నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం.పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.


