లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు...

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి

లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు...

మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం):

 

భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమకార్డు ద్వారా లభించే ప్రయోజనాలను అవగాహన కల్పించారు. కార్మికులకు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30 వేల చొప్పున నగదును అందజేస్తుందని, వారి కాన్పుకు ఒక్కరికి మరో 30 వేల చొప్పున అందిస్తుంది అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6,00,000 బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలకు పొడిగించిందని చెప్పారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదును ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ బోర్డు సంబంధించిన కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా వారి పిల్లలకు స్కాలర్షిప్ లు వంటి మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా బి ఎం ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. భారతీయ మజ్దూర్ సంఘ్ చేపట్టిన అనేక ఉద్యమాల ద్వారా 6 లక్షల ప్రయోజనాన్ని 10 లక్షలకు పెంచడం హర్షనీయమన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికులకు రావాల్సిన 32 కోట్ల క్లెయిమ్స్ ను విడుదల అయ్యేలా పనిచేశామని చెప్పారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారుడు శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు వి. తిరుపతి రెడ్డి, కార్యదర్శి ఏం భార్గవ్ నాయుడు, ఎం. నరసింహారెడ్డి, కేశవ, వెంకటనారాయణ, రమణయ్య, మనోహర్, ఎస్ కే రసూల్, కృష్ణ రెడ్డి, చేన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Latest News

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం.... శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...
ఘనంగా రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు...
మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....
అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణ మహోత్సవం....
చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...
తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం... 
కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....