తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం...
తూప్రాన్ , మార్చి 27 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ తూప్రాన్ పట్టణంలోని శివాలయం నుండి సీతామహాలక్ష్మిని ఊరేగింపుగా తీసుకెళ్లి రామాలయం వద్ద రాముడిని ఎదురుకోలు చేసి అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం పురోహితులు ఘనంగా నిర్వహించారు భక్తులకు భారీ ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు కళ్యాణం లో కూర్చునే భక్తులు భారీగా పాల్గొన్నారు భక్తులకు ఆర్యవైశ్య సంఘం నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి కౌన్సిలర్లు సత్య లింగం జైపాల్ నాయక్ శిరీష స్వప్న సబిత అన్నపూర్ణ ప్రియాంక రాములు ఐలేష్ యాదవ్ రాదా కుమారిపట్టణ ప్రముఖులు.నాయకులు పాల్గొన్నారు.


