అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణ మహోత్సవం....
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు....
మెదక్, మార్చి 27 (ప్రజాస్వరం):
భక్తుల జయ జయ ద్వానాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయం లో జగదభిరాముడు పేళ్లి తంతును అభిజిత్ లగ్నం లో సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రాముడికి, సీతమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పురోహితులు నిర్వహించిన కళ్యాణ మహోత్సవం లో మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆలయం అంత కూడా రామ నామం తో హోరెత్తిపోయింది. కళ్యాణ వీక్షించేందుకు పట్టణం నుంచి కాకుండా చుట్టూ పక్కల గ్రామాల నుంచి సైతం భారీగా భక్తులు తరలి వచ్చారు. కళ్యాణం అనంతరం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తొడుపునురి రామకృష్ణ, నర్సింలు, హరిత, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


