హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ...
ఎమ్మార్వో రఘువీరారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు
గజ్వేల్ ,మార్చి 16 (ప్రజాస్వరం ):
కాంగ్రేస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికొదిలేసి ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు మెదక్ ఎంపీ వర్యులు రఘునందన్ రావు సూచన మేరకు బీజేపీ వర్గల్ మండల అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డీ ఆధ్వర్యంలో వర్గల్ మండల ఎమ్మార్వో రఘువీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులు,విద్యార్థులు, మహిళల ఆక్రోశానికి అద్దం పడుతూ.. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి సమరశంఖం పూరించిందన్నారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రామాంజనేయులు చిరంజివి వెంకటేష్ బూత్ అధ్యక్షులు బద్రీనాథ్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి నాగరాజు గౌడ్ మఠంమహిపాల్ బబ్బూరి రవీందర్ శంకర్ గౌడ్ బర్కంనాగరాజు నరేందర్ రెడ్డి బన్నీ రెడ్డి పారశురాం గౌడ్ మహేందర్ గౌడ్ కాశీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


