లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష....

లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష....

రూ. 1 లక్ష జరిమానా విధించిన కోర్టు

నేరస్తుడు తూప్రాన్ మండలం జండాపల్లి కి చెందిన సోమగారి భాస్కర్

 

తూప్రాన్ , మార్చి 26 (ప్రజాస్వరం ) :

పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగికదాడి కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు వెల్లడించారు. తూప్రాన్ పీఎస్ పరిధిలోని జండపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేశారు.మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. అనంతరం సీఐ శ్రీధర్ సమగ్రంగా దర్యాప్తు చేసి పక్కా సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విజయవంతంగా నడిపించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య, భారోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కే. స్వేత కీలక పాత్ర పోషించారు. తూప్రాన్ ఎస్ఐ గంగరాజు, జిల్లా లైజనింగ్ ఆఫీసర్ బి. విఠల్, పీసీలు జి. కృష్ణ, సీడీఓ నాగరాజు తదితరులు సమన్వయం చేశారు. ఇలాంటి కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.