గవలపల్లిలో తైబజార్ వేలం...

3,44,000 స్వాధీనం చేసుకున్న సుధాకర్....

గవలపల్లిలో తైబజార్ వేలం...

చిన్న శంకరంపేట,   మార్చి 25 ( ప్రజాస్వరం):

 

చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామపంచాయతీ లో సర్పంచ్ సిద్ధిరాములు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో కై బజార్ వేలంపాటను నిర్వహించారు గ్రామానికి చెందిన 9 మంది వేలం పాటలో పాల్గొనగా 3 లక్షల 44 వేల రూపాయలకు సుధాకర్ అనే వ్యక్తి వేలం పాటలో కైవసం చేసుకున్నారు, ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తైబజార్ వేలంపాట నిర్వహించడం జరిగిందని 2026, 27 ఆర్థిక సంవత్సరం గాను వేలంపాట నిర్వహించగా 3లక్షల 44 వేల రూపాయలకు సుధాకర్ అనే వ్యక్తి కైవసం చేసుకోవడం జరిగిందని, ఇట్టి డబ్బులను రెండు విడుతలగా చెల్లించాలని సూచించడం జరిగిందని చెల్లించకపోతే వేలoను రద్దుచేసి వేరే వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధిరాములు, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు, యాదవరావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు,