రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ జిల్లా మూడో స్థానం...
గీతాస్కూల్ విద్యార్థులను అభినందనుంచిన..రామాంజనేయులు ....
తూప్రాన్, మార్చి 25 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థుల కు అభినందనలు తెలిపిన స్కూల్ కారస్పాండెంట్ రామాంజనేయులు డైరక్టర్ ఉషారాణి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం పొందిన అండర్ -14 మెదక్ జిల్లా జట్టులో అద్భుత ప్రతిభ కనబరచిన గీతా స్కూల్ విద్యార్థులు యన్. మహిత్. యన్. నాగ శ్రీకర్ లను పాఠశాల కరెస్పాండెంట్ పి. రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.
ఈ సందర్బంగా ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు శైలెందర్, కరుణాకర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


