సేవాలాల్ పుణ్యక్షేత్రం రాజధానిలో ఏర్పాటు చెయ్యాలి....

జైపాల్ నాయక్ ....

సేవాలాల్ పుణ్యక్షేత్రం రాజధానిలో ఏర్పాటు చెయ్యాలి....

తూప్రాన్ , మార్చి  25 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ లో సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం హైదరాబాద్ లో ఏర్పాటు కోసం గురువారం అసంబ్లీ ముట్టడికి వెళ్తున్న బంజారాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ తో పాటు మరికొందరిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం

లంబాడీల కోరిన చోట సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయాలని లంబాడీల ఆత్మగౌరవం ఉంటుందని సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం అడవిలోనే ఉండాల్నా హైదరాబాదులో ఉండకూడదా అని ఆలోచనతో మేము అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుంటే తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ కుట్రలతో ఏవి చేసిన హైదరాబాదులోనే పుణ్యక్షేత్రం ఉండేలా చేయాలని లేని ఎడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బంజారాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు ఆధ్వర్యంలో చర్చించి మల్లి కార్యచరణ ప్రకటిస్తామని జైపాల్ నాయక్ తెలిపారు