మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదు

 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరిక

మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదు


హైదరాబాద్ మార్చ్ 13 ( ప్రజాస్వరం ) : 
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్‌పై తమ పార్టీకి వ్యతిరేకత లేదనీ, అయితే పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం అని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం గానీ, మూసీ ప్రాజెక్టును గానీ తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని తమ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.
మూసీ నది తప్పకుండా పునరుజ్జీవనం కావాలని ఇప్పటికీ చెబుతున్నామని, కానీ ‘గాంధీ సరోవర్’ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం భావ్యం కాదన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, ఆ ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. సబర్మతి నదిని ఉదాహరణగా చెబుతూ మాట్లాడేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేసి, ముందుగా నది శుభ్రపరిచారని చెప్పారు. గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రీ-అలైన్ చేసి ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాలు హోర్ముజ్ జల సంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మన దేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని రాంచందర్ రావు చెప్పారు.

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...