ఈ నెల 15 న ధర్నా ను విజయవంతం చేయండి....

ఈ నెల 15 న ధర్నా ను విజయవంతం చేయండి....

మెదక్, మార్చ్ 13 (ప్రజాస్వరం):

 

హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 15 న జరిగే ధర్నా ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 61 సంవత్సరాల నిండిన 3797 మంది వీఆర్ఏ వారసుల ఉద్యోగ సాధన కై తల పెట్టిన ధర్నా కార్యక్రమన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ధర్నా కు టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏ వారసులు అధిక సంఖ్యలో హాజరై ధర్నా ను విజయవంతం చేయాలన్నారు.

Latest News