మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన తహసిల్దార్...

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన తహసిల్దార్...

చిన్న శంకరంపేట,    మార్చి 13 ( ప్రజాస్వరం) :

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహసిల్దార్ మాలతి పరిశీలించారు, నిలువ ఉన్న కూరగాయలను పరిశీలించి నాణ్యమైన కూరగాయలు తీసుకోవాలని, అదేవిధంగా నిత్యావసర సరుకులు నిలువ ఉన్న గదిని పరిశీలించి పప్పుదినుసులను, విద్యార్థులకు అందజేస్తున్న పల్లి చెక్కిలు, స్నాక్స్ ను ఆమె పరిశీలించారు, టెండర్ వాళ్లు తీసుకువచ్చిన సమయంలో నాణ్యమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతకు ఆమె సూచించారు అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు, విద్యార్థులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు, అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు మధ్యాహ్న భోజన వంటలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాలతి మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాని పరిశీలించడం జరిగిందని పాఠశాల పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన వంటలు, ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తినిచ్చిందని ఆమె తెలిపారు, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని ప్రతి రోజు కూడా ఇదే విధంగా నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ప్రతి రోజు పాఠశాల పరిసరాలు అన్నీ కూడా ఇదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమం లో తహశీల్దార్ మాలతి తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ గీత పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Latest News