మండలాన్ని నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలి..
బీజేపీ నాయకులు....
నార్సింగి, మార్చి 26 ( ప్రజాస్వరం ):
దేశ వ్యాప్తంగా త్వరలో అసెంబ్లీలు పెరుగుతున్న నేపధ్యంలో నార్సింగి మండలంను నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నార్సింగీ చుట్టుప్రక్కల గల మండలలు అయిన రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, మాసాయిపేట, నిజాంపేట దౌల్తాబాద్ మండలాలలో గల గ్రామాలు నార్సింగి మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం లో అనువుగా ఉన్నాయని, నార్సింగి మండలం 44 వ జాతీయ రహదారి పై ఉంటుందని ఎటువంటి బైపాస్ రోడ్డు లేకుండా ఉంది మరియు భౌగోళికంగా నార్సింగి కి కూత వేటు దూరం లో మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కలదు ఇప్పుడు ఉన్న మెదక్ జిల్లా లో అధిక ఓటర్లు మరియు జనాభా ప్రాతిపదికన గణనీయమైన అవకాశాలు కలవు పైన పేర్కొన్న మండలాల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, కొత్త నియోజక వర్గాల ఏర్పాటులో నార్సింగి కి అవకాశం ఇచ్చి గతంలో నార్సింగి కి జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గం చేయాలని .బీజేపీ మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలుపుకొని జెండా లు ఎజెండాలు పక్కన పెట్టి నియోజకవర్గమే ఎజెండాగా ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు యెన్నం లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కుమ్మరి నర్సింలు, బిజెపి నాయకులు సత్యపాల్ రెడ్డి, దాయం నరేష్ తదితరులు పాల్గొన్నారు.


